న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్..! 15 d ago
ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ హ్యాట్రిక్ తీశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ బౌలర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే అల్ అవుట్ అయింది. పేస్ బౌలర్ అట్కిన్సన్ వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ వికెట్లను తీసి హ్యాట్రిక్ అందుకున్నాడు. 26 ఏళ్ల ఆ బౌలర్ ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓ సెంచరీతో పాటు అయిదు వికెట్లు తీశాడు.